ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శనివారం, 5 మే 2018 (19:39 IST)

ట్రీట్మెంట్ తీసుకుంటున్న మహిళా రోగిపై వార్డ్ బోయ్ అత్యాచారం

కామాంధులు ఆంబోతుల్లా విహరిస్తున్నట్లే వుంది. రోగులను కూడా వదలడంలేదు ఈ కామాంధులు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళా రోగిపై వార్డ్ బోయ్ నాగరాజు అత్యాచారానికి పాల్పడ్డాడు. రోగులకు సేవలందిస్తూ, వారిని కంటికి

కామాంధులు ఆంబోతుల్లా విహరిస్తున్నట్లే వుంది. రోగులను కూడా వదలడంలేదు ఈ కామాంధులు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళా రోగిపై వార్డ్ బోయ్ నాగరాజు అత్యాచారానికి పాల్పడ్డాడు. రోగులకు సేవలందిస్తూ, వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వార్డ్ బోయ్ ఈ అఘాయిత్యానికి పాల్పడటం తీవ్ర చర్చనీయాంశమైంది.
 
విధుల్లో ఉన్న హోంగార్డు ఖమర్ వార్డుబోయ్ చేసిన అత్యాచారం విషయాన్ని చెప్పకుంగా గోప్యంగా వుంచాడు. ఐతే బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యాన్ని చెప్పడంతో విషయం వెలుగుచూసింది. అఫ్జల్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.