గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : సోమవారం, 24 డిశెంబరు 2018 (14:57 IST)

కేసీఆర్‌ను త్వరలోనే కాంగ్రెస్‌లో చేర్పిస్తానంటున్న కాంగ్రెస్ నేత ఎవరు?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేర్చిస్తానంటూ కాంగ్రెస్ నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వెల్లడైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన గెలుపొందిన నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 
 
ఈ నేపథ్యంలో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే పదవులకు అమ్ముడుపోయే రకం కాదన్నారు. పైగా, బెదిరింపులకు భయపడే పిరికివాళ్ళం కామన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్‌నే కాంగ్రెస్ పార్టీలో చేర్చిస్తామన్నారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, తాను కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. అధికారం కోసం పార్టీ నేతలం తాముకాదన్నారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, నమ్ముకున్న ప్రజల ఆకాంక్షల సాధన కోసం నీతిగా పనిచేస్తానని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్‌ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రజల ఓట్లతో తెరాస అభ్యర్థులు గెలవలేదని, కేవలం ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే విజయం సాధించారని ఆయన ఆరోపించారు.