శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 మే 2021 (18:29 IST)

ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో మహిళకు వేధింపులు.. ఉన్నతోద్యోగి..?

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇంకా పనిచేసే చోట లైంగిక వేధింపులు ఎదుర్కొంటూనే వున్నారు. తాజాగా హైదరాబాద్, హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఒక ఉన్నతోద్యోగి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ మహిళ అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. అల్వాల్‌లో నివసించే ఓ మహిళ (35) హకీం పేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో పనిచేస్తోంది.
 
కొన్ని రోజులుగా ఆమె తన సీనియర్ ఉద్యోగి ఎస్.కె.శర్మ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని రక్షణ కల్పించాలని కోరుతూ ఎయిర్ ఫోర్స్ మెయిన్ గేట్ దగ్గర ధర్నా చేసింది. అధికారులు సూచన మేరకు అల్వాల్ పోలీసుస్టేషన్ లోఫిర్యాదుచేసింది కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.