పొలానికి వెళ్ళొస్తుండగా... వివాహితను పాడుబడిన గుడిసెలోకి ఎత్తుకెళ్లి?

మహిళలు ఒంటరిగా తిరగాడని పరిస్థితి ఏర్పడింది. మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా పొలం వద్దకు వెళ్లి ఒంటరిగా వస్తున్న వివాహితపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన మెదక్

rape victim
selvi| Last Updated: మంగళవారం, 7 నవంబరు 2017 (11:22 IST)
మహిళలు ఒంటరిగా తిరగాడని పరిస్థితి ఏర్పడింది. మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా పొలం వద్దకు వెళ్లి ఒంటరిగా వస్తున్న వివాహితపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హవేళీఘణపూర్‌ మండలం కూచన్‌పల్లిలో ఓ వివాహిత మహిళ వరిపొలంలో పొద్దంతా పనిచేసి పొద్దుపోయాక తిరిగి ఇంటికొస్తుంది.

ఒంటరిగా వస్తున్న ఆమెను చూసిన అదే గ్రామానికి చెందిన దుర్గారి రాజు, తలారి దేవయ్య మార్గమధ్యంలో అడ్డుపడి.. ఆమెను పాడుబడిన గుడిసెలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. దుర్గారి రాజు వివాహితపై అత్యాచారం చేయగా కాపలాగా తలారి దేవయ్య ఉన్నట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కేసు నమోదు చేశామని.. దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.దీనిపై మరింత చదవండి :