గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (14:21 IST)

జగిత్యాలలో దారుణం: మంచాన్నే చితిగా మార్చుకొంది..

జగిత్యాలలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంచానికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనారోగ్యంతో పాటు ఎవరు లేని జీవితం వేధించడంతో అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆమె.. ఆ మంచాన్నే తన చితిగా మార్చుకొంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో మంచానికి నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బంజరుదొడ్డి ప్రాంతానికి చెందిన బొండ ఈరమ్మ భర్త రత్నం ఇరవై ఏళ్ల క్రితమే మృతి చెందాడు. దీంతో కూలీ నాలీ చేసుకుంటూ తన కొడుకును పెంచి పెళ్లి చేసింది. విధి వక్రించడంతో 8 ఏళ్ల క్రితం కొడుకు, కోడలు ఇద్దరు ప్రమాదంలో మృతి చెందారు. అప్పటినుంచి మనవడిని పెంచుతూ జీవిస్తున్న ఆమె గత కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో పోరాడుతూ మంచానికే పరిమితమయ్యింది.
 
ఆస్పత్రి ఖర్చుల కోసం మనవడిని ఇబ్బంది పెట్టకూడదనుకొంది. మంగళవారం ఇంట్లో ఎవరులేని సమయంలో తన మంచానికి నిప్పు పెట్టుకొని సజీవ దహనం అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.