Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

యాక్ థూ.. మునుగోడు గెలుపు ఓ గెలుపేనా? తెరాసపై షర్మిల సెటైర్లు

Written By ఠాగూర్
Updated: సోమవారం, 7 నవంబరు 2022 (09:13 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తెరాస కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అతికష్టంమీద పదివేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కిపులో మొదటి రౌండ్ నుంచి 15వ రౌండ్ వరకు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు 10 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో తెరాస అభ్యర్థి గెలుపొందారు. ఈ ఫలితంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల సెటైర్లు వేశారు. ఇదీ ఓ గెలుపేనా అంటూ మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి, హత్య చేసి గెలిచామని సంబరాలు చేసుకోవడాని సిగ్గుండాలి సీఎం కేసీఆర్ గారూ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఊరికో ఎమ్మెల్యేను, మండలానికి ముగ్గురు మంత్రులు పెట్టి మద్యం, మనీ పంచి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఓటర్లను బెదిరించి, ఫాంహౌస్ డ్రామా ఆడి ఇలా ఎన్నో కుయుక్తులు పన్నినా కేవలం పది వేల ఓట్లతో గెలిచిన గెలుపు ఓ గెలుపేనా అంటూ విమర్శించారు. 
 
పనిలోపనిగా బీజేపీపై కూడా ఆమె విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేని కొని తెచ్చి, ఉప ఎన్నిక తెచ్చిన బీజేపీ నేతలు నైతికత గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటున్న బీజేపీకి ఇప్పుడైనా సిగ్గువచ్చిందా? దొంగదారి రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరన్న విషయాన్ని  బీజేపీ నేతలు ఇప్పటికైనా గ్రహించాలని ఆమె సూచించారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments