ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 నవంబరు 2022 (09:14 IST)

7న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రవేశ పరీక్ష - ఏర్పాట్లు పూర్తి

tspsc
తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం రాత పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 24 పోస్టుల భర్తీ కోసం సోమవారం ఈ పరీక్షను నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమ్మతం తెలిపింది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా 56 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లుచేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) విధానంలో ఈ పరీక్షను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.