ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (17:38 IST)

తెలంగాణా పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగ అవకాశాలు... నోటిఫికేషన్ జారీ

telangana govt
తెలంగాణ సర్కారు నిరుద్యోగులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో 833 ఇంజినీరింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది టి సర్కార్. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. అంతేకాకుండా.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి పోస్టులను కూడా టీఎస్పీఎస్సీ విడుదల చేసింది.
 
తాజాగా అసిస్టెంట్‌ ఇంజినీర్‌, మున్సిపల్‌ అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టులు, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
 
ఇలా వివిధ విభాగాల్లో 833 ఇంజినీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్‌ 21 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు