మంగళవారం, 16 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2022 (15:33 IST)

ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు - విద్యా సంస్థల మూసివేత

flood water
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కుంభివృష్టి కురుస్తుంది. ఈ కారణంగా అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. గంగా, యమున వంటి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నారు. దీంతో అనేక లోతట్టు ప్రాంతాన్నీ నీట మునిగాయి. ఈ వరదలో చిక్కుకున్న వర్ష బాధితులను అధికార యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. ఫలితంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 15 జిల్లాల్లో విద్యా సంస్థలను మూసివేశారు. 
 
ఈ భారీ వర్షం కారణంగా ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, రాష్ట్ర రాజధాని లక్నో, రాంపూర్, మిరట్ సహా 15 కి పైగా జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలను సోమవారం మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ జిల్లాల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. ఈ మేరకు జిల్లాల డీఎం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. 
 
మరోవైపు, వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అన్ని పాఠశాలలకు అక్టోబరు 10వ తేదీని సెలవులుగా ప్రకటిస్తూ ఘజియాబాద్ డీఎం రాకేష్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. వర్షం హెచ్చరికలో ఘజియాబాద్ ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. ఈ సమయంలో రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.