భువనేశ్వరి ఆస్తులు కోల్పోయిందట.. సుబ్రహ్మణ్యంపై.. పోలీసులకు ఫిర్యాదు..!
క్యారెక్టర్ ఆర్టిస్ట్ భువనేశ్వరి గుర్తుందా..? శంకర్ బాయ్స్, గుడుంబా శంకర్‌లో నటించిన పాము కళ్ల చిన్నది.. ఆ మధ్య ప్రాస్టిట్యూషన్ కేసుల్లో అరెస్టయ్యింది. ఇప్పుడు ఈమె గురించిన టాక్ ఎందుకొచ్చిందంటే.. తన స్వస్థలమైన అన్నూరులో భువనేశ్వరి తన విలువైన ఆస్తులను కోల్పోయింది.
ఇంకా తన ఆస్తులు కోల్పోయానని పోలీసులకు భువనేశ్వరి ఫిర్యాదు చేసిందట. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. రెండేళ్ల క్రితం అన్నూరులో తనకు గల థియేటర్, ఇళ్లును అమ్మాలని డిసైడ్ చేసిందట. ఈ క్రమంలో లోకల్ బిజినెస్‌మేన్ సుబ్రహ్మణియంను కలిసి అమ్మాలని డిసైడ్ అయ్యిందట.
కానీ అనివార్యకారణాలచేత అప్పటికీ తన ఆస్తుల్ని అమ్మకూడదని డిసైడ్ చేశానని.. అయితే ప్రస్తుతం తన విలువైన ఆస్తుల్ని సుబ్రహ్మణ్యం అక్రమంగా ఆక్రమించుకున్నాడని భువనేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదేంటని న్యాయమడిగినందుకు.. సుబ్రహ్మణ్యం సరిగ్గా సమాధానం చెప్పట్లేదని భువనేశ్వరి చెప్పింది.
ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేపట్టాలని ఫోర్జరీ డాక్యుమెంట్స్‌తో తన ఆస్తులను కొల్లగొట్టిన సుబ్రహ్మణ్యంపై సరైన చర్యలు తీసుకోవాలని భువనేశ్వరి కోరింది.