తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అల్లరి నరేష్ పెండ్లి పిలుపు... ప్లీజ్ మీరు రావాలి సార్...
తన వివాహానికి విచ్చేయాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అల్లరి నరేష్ ఆహ్వానించారు. పెండ్లి పత్రికతో కేసీఆర్ స్వగృహంలో కలిసి ఆయనను ఆహ్వానించాడు అల్లరి నరేష్. శుభలేఖను ఇచ్చేందుకు తన సోదరుడు ఆర్యన్ రాజేష్‌తో కలిసి వెళ్లాడు అల్లరి నరేష్.
అల్లరి నరేష్ వివాహం ఈ నెల 29వ తేదీన హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో జరుగనుంది. కాగా అల్లరి నరేష్ నిశ్చితార్థం విరూపతో చెన్నైలో జరిగిన విషయం తెలిసిందే.