అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో షార్ట్ ఫిలిమ్!
అల్లు అర్జున్ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా ప్రతిభ వున్నవారిని ప్రోత్సహిస్తూ వుంటారు. అందులో భాగంగానే సమాజం కోసం ఏమన్నా చేయాలనేది ఉద్దేశ్యంతో సమాజంలో చైతన్యం రగిల్చేందుకు తన స్వీయ నిర్మానంలో ఓ షార్ట్ ఫిలింలో నటిస్తున్నాడు. దీనికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ షాట్ ఫిలింను స్వాతంత్య్ర దినోత్సవం రోజు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రముఖ హీరోలు ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు.
దాంతో అల్లు అర్జున్ చేస్తున్న ఈ కార్యక్రమానికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువలా కురుస్తున్నాయి. మరి సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ షార్ట్ ఫిలిం ఎలా వుంటుందో త్వరలో తెలుస్తుంది.