1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 జనవరి 2015 (13:07 IST)

అసిన్‌కు ఆఫర్లు నిల్.. ఇక సొంతూరిలో అలా కాలక్షేపం..

అసిన్‌కు ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. గజినీతో బాగా పాపులర్ అయిపోయి.. ఒక్కసారిగా బాలీవుడ్‌కు జంప్ అయిన అసిన్‌కు బాలీవుడ్‌లో ఏవో నామమాత్రపు ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత దక్షిణాది సినిమా ఛాన్సులపై చులకనగా వ్యవహరించిన అసిన్‌కు ఆపై దక్షిణాదిన ఆఫర్లే రాలేదు. 
 
బాలీవుడ్ ఛాన్సులు తగ్గిపోవడంతో.. దక్షిణాది సినిమా ఛాన్సుల కోసం అసిన్ ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇక లాభం లేదనున్న అసిన్ సొంతూరైన కేరళకు చేరుకుంది. 
 
కేరళకు వచ్చిన అసిన్ ఆహారం, ఆయుర్వేదం, వ్యాయామం, ధ్యానం, అరోమా వంటి ఇతరత్రా అంశాలపై నేర్చుకుంటోంది. ప్రస్తుతం ఆల్ ఈజ్ వెల్ సినిమా కోసం  అసిన్ బరువును సక్రమించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది.