'ఫామ్ హౌస్'లో ఏం జరిగింది?
ప్రస్తుతం హర్రర్ థ్రిల్లర్స్‌కి, కామెడీ చిత్రాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మరో హార్రర్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎం.ఆర్.ఎల్. ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎన్.రెడ్డి దర్శకత్వంలో భవాని అగర్వాల్ 'ఫామ్‌హౌస్' పేరుతో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర లోగో, టీచర్ విడుదలైంది.
చిత్ర దర్శకుడు మాట్లాడుతూ... సాధారణంగా రేవ్ పార్టీలు శని, ఆదివారాల్లో వుంటాయి. సోమవారం జరిగిన సంఘటన ఏమిటనేది చిత్ర కథాంశం. మొదటి నుంచి చివరి వరకు ప్రతి సీన్ ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేలా వుంటుందని చెప్పారు.