1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: సోమవారం, 27 ఏప్రియల్ 2015 (21:35 IST)

సంగీతంపై 'గగలు.. నినిలు'

సంగీతంలోని సరిగమలు.. పేరుతో ఓ చిత్రం రాబోతుంది. అందులోని రాగాలను తీసుకుని సినిమాగా మారుస్తున్నారు.  స రిగమల్లోని 'గగ'లను.. పదనిసలల్లోని 'నిని'లను తీసుకొని 'గగలు..నినిలు' పేరుతో సంగీతానికి పెద్ద పీట వేస్తూ.. ఓ ఆహ్లాదభరిత ప్రేమకథాచిత్రాన్ని రూపొందించేందుకు సన్నా హాలు చేసుకుంటున్నారు ఆనంద్‌ కానుమోలు. పూనా ఫిలిం ఇనిస్టిట్యూట్‌ నుంచి డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో డిప్లమో తీసుకొన్న తర్వాత.. పలువురు దర్శకుల వద్ద ప్రాక్టికల్‌ పాఠాలు నేర్చుకొన్న ఆనంద్‌ కానుమోలు.. 'గగలు.. నినిలు' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. 
 
నూతన నిర్మాణ సంస్థ 'ప్రహ్లాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌' పతాకంపై భగవాన్‌ సమర్పణలో యస్‌.నర సింహరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోహన్‌, అతియ,రాజ్‌బాల హీరోహీ రోయి న్లుగా నటిస్తు న్న ఈ చిత్రంలో ఆర్కే, అవదూత గోపాలకృష్ణ, మణివర్ధన్‌, వలీ, వెంకట్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తు న్నారు. త్వరలో సెట్స్‌కు వెళ్లనున్న ఈ చిత్రానికి సంగీతం: గీతా పూనిక్‌, సమర్పణ: భగవాన్‌, నిర్మాత: యస్‌. నరసింహరాజు, దర్శకత్వం: ఆనంద్‌ కానుమోలు.