సుకుమార్ దర్శకత్వంలో... టెంపర్ స్టార్ కొత్త చిత్రం ప్రారంభం..!
ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో హీరో ఎన్టీఆర్ కొత్త చిత్రం ప్రారంభమైంది. ఇటీవల ఎన్టీఆర్ నటించిన టెంపర్ విడుదల సిద్ధం కావడంతో ఆయన అభిమానుల్లో ఎన్టీఆర్ తర్వాత చిత్రం ఏమిటా? ఎవరి తీస్తారా అనే సందేహం మొదలైంది.
ఈ విషయమై దర్శకుడు సుమార్ మాట్లాడుతూ..ఎన్టీఆర్‌లోని ఎనర్జీ లెవల్స్‌ని అద్భుతంగా ఆవిష్కరించే శక్తిమంతమైన కథను ఆయన సిద్ధం చేశారట. తాను ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం ఇదే ప్రథమమన్నారు. ఎన్టీఆర్‌లోని ఎనర్జీ లెవల్స్‌ని తగినట్టుగా ఎలివేట్ చేస్తూ, డిఫరెంట్ స్టైల్‌లో సాగే రివెంజ్ డ్రామా ఇది అని సుకుమార్ చెప్పారు.
బీవీఎస్‌ఎన్ ప్రసాద్, భోగవల్లి బాపినీడు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగాయి. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్‌కిది డిఫరెంట్ మూవీ అవుతుంది. స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చింది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్సూ ఈ కథలో ఉన్నాయి. జనవరి 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. మిగిలిన వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చెప్పారు.