కిక్ కాదు కిక్ 2 అంటే ఇదీ.. టుడే స్టార్ట్ రిలీజ్ డేట్ ఎనౌన్స్
స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కనున్న 'కిక్ 2' సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ హాజరవడంతో సందడి సందడిగా మారింది. కిక్ 2 రెగ్యులర్ షూటింగ్ మొదలవుతోంది. ఐతే గమనించాల్సిన విషయమేమిటంటే ఈ సినిమా ప్రారంభం కాకముందే నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ విడుదల తేదిని ప్రకటించారు.
'కిక్ 2' మే 28 2015న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో కథానాయిక పాత్రకి మిల్కీ బ్యూటీ తమన్నాను సెలెక్ట్ చేసినట్లుగా చిత్ర యూనిట్ వర్గాలు చెపుతున్నాయి. కాగా ‘కిక్’ చిత్రానికి సంగీతం అందించిన తమన్ ఈ కిక్ 2కి కూడా బాణీలు అందిస్తున్నాడు. మొత్తానికి రవితేజ కిక్ 2 కిక్కెక్కించడం ఖాయమంటున్నారు.
మాస్ మహారాజా రవితేజ, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన 'కిక్' ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ కిక్ టీమ్‌తో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బేనర్లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న 'కిక్-2' ఆగస్ట్ 20 ఉదయం గం. 8.43 ని||లకు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. నటరత్న ఎన్.టి.రామారావు చిత్రంపై తీసిన ఫస్ట్ షాట్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్లాప్‌నివ్వగా, మాస్ మహారాజా రవితేజ కెమెరా స్విచ్చాన్ చేశారు. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ షాట్‌ను డైరెక్ట్ చేశారు. ఇంకా ఈ ప్రారంభోత్సవంలో నందమూరి రామకృష్ణ, ఠాగూర్ మధు, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, భోగవల్లి ప్రసాద్, భోగవల్లి బాపినీడు, మహేంద్రబాబు తదితరుల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ - '''కిక్' తర్వాత మళ్ళీ సురేందర్‌రెడ్డితో మరో ఫుల్‌లెంగ్త్ ఎంటర్టైనర్ చేస్తున్నాను. మా ఇద్దరి కాంబినేషన్లో ఇది మంచి కిక్ ఇచ్చే సినిమా అవుతుంది'' అన్నారు. దర్శకుడు సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ - ''ఈ సినిమా 'కిక్'కి సీక్వెల్ కాదుగానీ అందరికీ డబుల్ కిక్ ఇచ్చే సినిమా అవుతుంది. 'కిక్'లో రవితేజ, ఇలియానా జంటగా నటించారు. వాళ్ళిద్దరి కొడుకు కథే 'కిక్ -2''' అన్నారు.
నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ - ''అతనొక్కడే' వంటి సూపర్‌హిట్ తర్వాత మా సురేందర్‌రెడ్డితో రవితేజ హీరోగా చేస్తున్న సినిమా ఇది. ఈరోజు నుంచే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. మార్చి 28న సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. హై టెక్నికల్ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తాము'' అన్నారు.
ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సంగీతం: యస్.యస్.థమన్, సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నారాయణరెడ్డి, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సురేందర్‌రెడ్డి.