1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By IVR
Last Modified: బుధవారం, 23 జులై 2014 (12:50 IST)

పవన్ హీరోయిన్ ను చుట్టుముట్టిన అగ్ని... వెర్రి కేకలు.. తప్పిన గండం

'తీన్మార్' సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన కృతి కర్బందా ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదానికి గురైనా తృటిలో దాని నుంచి తప్పించుకుంది. ఐతే ఈ అగ్ని ప్రమాదం షూటింగ్ సమయంలో జరుగలేదు, ఇది ఆమె విశ్రాంతి తీసుకుంటున్న హోటలు గదిలో జరిగింది. 
 
కృతి కర్బంద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో హోటలు గదిలో మంటలు వ్యాపించడంతో గదిలో నిద్రపోతున్న కృతి మొదట ఇదంతా కలలో జరుగుతోందని భ్రమించిందట. ఐతే కలలో కూడా అగ్ని కనబడితే తత్తరపాటు ఉంటుంది కనుక మెళకువ వచ్చి తేరుకుని చూసేసరికి మంటలు పెద్దవై చుట్టూ కమ్ముకున్నాయట. దాంతో వెర్రి కేకలు వేయడంతో అక్కడి సిబ్బంది వచ్చి ఆమెను కాపాడారు.