గ్లామరే కాదు సీతగానూ చేస్తానంటున్నది
ఇంతవరకు మధుశాలిని అంటే గ్లామర్, అందాలు, ఎక్స్‌పోజింగ్ చేస్తుందంటూ పలువురు పలురకాలుగా చెబుతుండేవారు. దానిపై మధుశాలిని మాట్లాడుతూ... అవన్నీ విన్నాను. కానీ నాకు ఊహించని అవకాశం నటనకు స్కోప్ వున్న చిత్రం వచ్చింది. అదే 'సీతావలోకం'. ఇందులో నేను ప్రధాన పాత్ర పోషించాను. నటిగా ఇటువంటి అవకాశం రావడం అదృష్టమని అంటోంది.
గ్లామర్ రోల్స్‌లోనే ఎక్కువగా చూడడం వల్ల మధుశాలిని ఇలాంటి క్యారెక్టర్స్ ఏం చెయ్యగలదు అనుకునేవారు. వాటన్నింటినీ బ్రేక్ చెయ్యడానికి నాకు మంచి అవకాశం వచ్చింది. నేను ఇలా చెయ్యగలుగుతానా అని నాకే నమ్మకం కలగలేదు. అలాంటి ధైర్యాన్ని నాకిచ్చిన దర్శకుడు వేణుగారికి థాంక్స్ అంటూ చెప్పుకొచ్చింది.