1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 27 ఆగస్టు 2014 (12:34 IST)

మహేష్ బాబు డబుల్ రోల్ చెయ్యట్లేదు... డీలాపడ్డ ఫ్యాన్స్

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ లలో ప్రిన్స్ మహేష్ బాబు ముందువరుసలో ఉంటారనేది టాలీవుడ్ టాక్. మహేష్ ఇప్పటివరకు డిఫరెంట్ పాత్రలు చేసినా ఏ సినిమాలోనూ ఇంతవరకూ డబుల్ రోల్... ద్విపాత్రాభినయం అనేది చేసినట్లు లేరు. ఈ నేపథ్యంలో తొలిసారిగా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఐతే దీనిపై శివ స్పందిస్తూ అవన్నీ గాలి కబుర్లే అని కొట్టిపారేశారు. మహేష్ ద్విపాత్రిభినయం చేయడం లేదని కొట్టిపారేశారు. దీంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు.