శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Ganesh
Last Updated : బుధవారం, 2 జులై 2014 (14:52 IST)

సమంతకు ఫేవరేట్‌గా మారిన ఆ బూతు డైలాగ్!

టాలీవుడ్ క్రేజీ స్టార్ సమంత, నాగచైతన్య నటించిన "ఆటోనగర్ సూర్య" ఆశించినంత స్థాయిలో ఆదరణ తెచ్చుకోకపోయినా తనకు మాత్రం భలే నచ్చేసిందని అంటోంది. అయితే ఇందులో ఓ డైలాగ్ తనకు ఎప్పటికీ గుర్తిండిపోతుందని చెబుతోంది ఈ భామ. అంతేకాదు ఈ డైలాగ్ ఎప్పటికీ నాకు ఫేవరేట్ అని అంటోంది.

ఇప్పటివరకు చాలా చిత్రాల్లో నటించాను, ఏ డైలాగ్ గుర్తుంటుందో గుర్తుండదో తెలియదు కానీ ఆటోనగర్ సూర్య చిత్రంలో చెప్పిన ఆ డైలాగ్ నాకు ఎప్పటికీ గుర్తుంటుంది అని మరీ చెబుతోంది సమంత. ఆటోనగర్ సూర్య చిత్రంలో విలన్ ఆమెని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో "పెళ్లి చేసుకో.. కానీ పిల్లలు మాత్రం వాడితోనే.. పిల్లల పోలికలు మాత్రం గ్యారంటీ ఇవ్వలేను ఎందుకంటే పిల్లలు వాడి పోలికలతోనే పుడతారు" అని గట్టిగా చెబుతుంది. ఆ డైలాగ్‌‌‌కి థియేటర్‌లో ఈలలు, చప్పట్లు మారుమోగుతున్నాయి. ఆ డైలాగ్ తనకి బాగా నచ్చిందని చెబుతోంది ఈ భామ.