పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకే రోల్ మోడల్... శింబు
పవన్ కళ్యాణ్ సినిమా ఇండ్రస్టీకే రోల్ మోడల్ అని శింబు చెబుతున్నాడు. ఇటీవలే ఆయనకు గాయకుడిగా సింహా-2014 అవార్డుల్లో ఉత్తమ గాయకుడిగా అవార్డు ప్రదానం చేశారు. 'బాద్షా' చిత్రంలో 'యు ఆర్ మై డైమండ్ గాళ్' అనే పాటను ఆయన పాడారు. ఆ పాటకు ఆయనకు అవార్డు దక్కింది. అది కూడా చిరంజీవి చేతుల మీదుగా తీసుకోవడం మరింత ఆనందంగా ఉందని చెబుతున్నాడు.
ఎన్‌టిఆర్, థమన్ తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాడు. ఇంకా మాట్లాడుతూ... నా ఫేవరెట్ ఏక్టర్ తెలుగులో పవన్ కళ్యాణ్. తను ఇండస్ట్రీకే రోల్ మోడల్. ఆయనతో పని చేయాలని ఎప్పటినుంచో ఆశిస్తున్నాను. ఫ్యూచర్‌లో ఆయన సినిమాలో ఓ పాట పాడే ఛాన్స్ వస్తుందని భావిస్తున్నట్లు చెప్పాడు. ఇటీవలే సింహా అవార్డులు జరిగాయి.