''లింగా''లో నా షూటింగ్ ఓవర్.. ''రజినీ'' సర్‌కు థ్యాంక్స్!: సోనాక్షి
'లింగా'' సినిమా నటించిన గబ్బర్ సింగ్ భామ ఆకాశంలో తేలిపోతోంది. దక్షిణాదిన ఒక్క సినిమాలో నటించడం ఎంతో సంతోషంగా ఉందని సంబరపడితోంది. అదీ తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్‌తో కలిసి సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది.
ఇటీవల 'లింగా'కు సంబంధించి తన షూటింగ్ పార్ట్‌ను సోనాక్షి సిన్హా విజయవంతగా పూర్తి చేసుకుంది. ఈ సినిమా ద్వారా ఎంతో నేర్చుకున్నానని, లింగాలో నా షూటింగ్ పూర్తయ్యింది. ఈ అవకాశం ఇచ్చిన రజినీ సర్‌కు, చిత్ర టీమ్ మొత్తానికి నా కృతజ్ఞతలు. సినిమా కోసం పనిచేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. నమస్తే" అంటూ సోను ట్వీట్ చేసింది.