బాహుబలి కథ ఏమిటో నాకు తెలీదు... నటించానంతే... తమన్నా
బాహుబలి చిత్రంలోని మొదటి భాగంలో ఎక్కువగా కన్పిస్తా. రెండో భాగంలో పరిమితమే... అంటూ నటి తమన్నా తెలియజేస్తుంది. ఆమె ఇటీవలే జీ తెలుగు ఛానల్‌కు అంబాసిడర్‌గా వుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ.... సినిమా రంగంలోకి వచ్చి 10 ఏళ్ళయింది. జీ తెలుగు కూడా పదేళ్ళయింది. నా పద్ధతి నచ్చి వారు నన్ను అంబాసిడర్‌గా తీసుకున్నారు.
దీనికోసం కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌లు చేస్తాను. టీవీలను మహిళలే ఎక్కువగా చూస్తుంటారు. వారికి మరింత దగ్గరవుతానని తెలిపారు. బాహుబలి గురించి చెబుతూ.. ఆ చిత్రంలోని కథ ఎవ్వరికీ తెలీదు. పాత్ర వరకే పరిమితం. నటించే వారికి ఏమీ అర్థంకాదు. అదంతా రాజమౌళి ఊహ నుంచి వచ్చిందే. నేను ఈ రంగంలోకి రావాలని కసి, పట్టుదలతో వచ్చాను. ప్రతిసారీ రోజుకొక విషయాన్ని నేర్చుకుంటున్నానని తెలిపారు.