శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 22 ఆగస్టు 2020 (18:38 IST)

ప్రభాస్ రాముడు అయితే... సీత ఎవరు?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్ర పోషించనున్నారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అందరిలో ఒకటే డౌట్. ప్రభాస్ రాముడు అయితే... సీత ఎవరు..? అయితే... తాజా సమాచారం ప్రకారం... బాహుబలి సినిమాలో ప్రభాస్ సరసన నటించి అనుష్క అయితే కరెక్ట్ సెట్ అవుతుందని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి.
 
అలాగే శ్రీరామరాజ్యం సినిమాలో సీతగా నటించిన అందాల తార నయనతార కూడా సీతగా నటిస్తే బాగుంటుంది అంటున్నారు. నయనతార ప్రభాస్‌తో కలిసి బిల్లా, యోగి సినిమాల్లో నటించింది. వీరిద్దరి జంట కూడా బాగుంటుందనే టాక్ వినిపిస్తోంది. వీరితో పాటు క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే పేరు కూడా వినిపిస్తుంది. ఈ అమ్మడు బాలీవుడ్లో సల్మాన్ సరసన నటిస్తుంది. పూజా పేరు కూడా పరిశీలిస్తున్నారు.
 
వీరందరితో పాటు మహానటి సినిమాతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న కీర్తి సురేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తారని సమాచారం. మరి.. సీత పాత్రను ఎవరు దక్కించుకుంటారో చూడాలి.