ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : బుధవారం, 1 నవంబరు 2017 (18:09 IST)

కుకీస్ వ్యాపారంలోకి వెంకటేష్ తనయ ఆశ్రిత దగ్గుబాటి...

సినీ నటుడు వెంకటేష్ కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి తొలిసారి వార్తల్లో నిలిచింది. సినిమాలకు దూరంగా వుండే వెంకీ డాటర్... అమెరికాలో బిస్కెట్స్ వ్యాపారానికి సంబంధించిన కోర్సు ముగించారని తెలుస్తోంది. ఈ కోర్సు ప

సినీ నటుడు వెంకటేష్ కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి తొలిసారి వార్తల్లో నిలిచింది. సినిమాలకు దూరంగా వుండే వెంకీ డాటర్... అమెరికాలో బిస్కెట్స్ వ్యాపారానికి సంబంధించిన కోర్సు ముగించారని తెలుస్తోంది. ఈ కోర్సు పూర్తికావడంతో ఆమె క్వాలిటీ బిస్కెట్స్ బిజినెస్‌ను వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. కుకీస్ తయారు చేసి.. వాటిని రీటైల్ అవుట్‌లెట్లలో అమ్మాలని భావిస్తున్నట్లు సమాచారం. 
 
ఫుడ్ అండ్ ట్రావెల్‌పై ఎక్కువ ఆసక్తి చూపే ఆశ్రిత.. సోషల్ మీడియాలో ఫుడ్ అండ్ ట్రావెల్‌కు సంబంధించిన ఫోటోలనే పోస్ట్ చేస్తారు. రామానాయుడు స్టూడియోస్‌లోనే ఆశ్రిత ప్రారంభించే కుకీల రీటైల్ షాప్స్ వుంటాయని వార్తలు వస్తున్నాయి. 
 
మరోవైపు నాగార్జున తనయుడు, యువ హీరో అఖిల్ పెళ్లిపై మళ్లీ రూమర్లు మొదలైనాయి. ఇది వరకూ అఖిల్ పెళ్లి నిశ్చితార్థం పూర్తయిన తర్వాత ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సారి అఖిల్ పెళ్లి విషయంలో వెంకీ తనయ పేరు వినిపించిన సంగతి విదితదే.