గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 11 జూన్ 2017 (17:47 IST)

'దేవసేన'కు ప్రభాస్ మొండిచేయి.. లిప్‌లాక్ ఇచ్చే భామకు ఛాన్స్.. నిజమా?

"బాహుబలి" చిత్రంలో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన హీరో ప్రభాస్. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దేవసేనగా అనుష్క నటించింది. అయితే, 'బాహుబలి' చిత్రం తర్వాత ప్రభాస్ నటించే చిత్ర "సాహో". రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో

"బాహుబలి" చిత్రంలో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన హీరో ప్రభాస్. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దేవసేనగా అనుష్క నటించింది. అయితే, 'బాహుబలి' చిత్రం తర్వాత ప్రభాస్ నటించే చిత్ర "సాహో". రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రంలో హీరోయిన్‌ను మాత్రం దర్శకనిర్మాతలు ఎంతకీ ఖరారు చేయలేక పోతున్నారు. దీనికి కారణం.. చిత్రం హీరోయిన్ పాత్ర అలాంటిది.
 
అయితే, ఈ సినిమా కోసం ప్రస్తుతం ముగ్గురు భామలను ఫైనలైజ్‌ చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. వారిలో ఎవరో ఒకరిని హీరోయిన్‌గా తీసుకుంటారట. ఆ ముగ్గురూ.. అనుష్క, పూజా హెగ్డే, మంజిమా మోహన్‌. ఈ సినిమా హీరోయిన్‌గా అనుష్క పేరు ముందు నుంచి వినిపిస్తోంది. అలాగే కొన్ని రోజుల క్రితమే పూజ పేరు కూడా తెరపైకి వచ్చింది. 
 
ఇప్పుడు తాజాగా నాగచైతన్యతో ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో నటించిన మంజిమా మోహన్‌ పేరు వినిపిస్తోంది. ఇటీవలె తెరపై గ్లామరస్‌గా కనిపించడానికి ఎటువంటి దుస్తులు ధరించడానికైనా వెనుకాడనని, హీరోలతో లిప్‌లాక్‌ సీన్లకు కూడా సిద్ధమేనని మంజిమ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. మరి, ఈ ముగ్గురిలో ప్రభాస్‌ ఎవరికి ఛాన్స్‌ ఇస్తాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.