శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 మార్చి 2017 (13:47 IST)

మల్లితీగలా తయారై.. హైదరాబాద్ వచ్చిన శ్వేతబసు.. ఛాన్సులిస్తారా?

కొత్తబంగారు లోకం హీరోయిన్ శ్వేతబసు ప్రసాద్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ చేసింది. ప్రస్తుతం సీరియల్‌తో పాటు బాలీవుడ్‌లో రూపొందిన బడా మూవీ.. ‘బద్రీనాథ్‌కి దునియా’లోనూ స్మాల్ రోల్‌లో నటించిన శ్వేత

కొత్తబంగారు లోకం హీరోయిన్ శ్వేతబసు ప్రసాద్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ చేసింది. ప్రస్తుతం సీరియల్‌తో పాటు బాలీవుడ్‌లో రూపొందిన బడా మూవీ.. ‘బద్రీనాథ్‌కి దునియా’లోనూ స్మాల్ రోల్‌లో నటించిన శ్వేత ప్రస్తుతం తెలుగు ఛాన్సుల కోసం మల్లి తీగల తయారైంది. అందుకే ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఈ ముద్దుగుమ్మ లుక్ చూసి అంతా కంగుతిన్నారు. మెరుపుతీగలా తయారైన తన అందాలతో శ్వేతాబసు ప్రసాద్ అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. 
 
అయితే టాలీవుడ్ నుంచి వెళ్ళిపోయిన శ్వేతబసు సూపర్ లుక్‌లో వచ్చినా దర్శకనిర్మాతలు ఆమెకు ఛాన్స్ ఇస్తారో లేదో మరి.. టాలీవుడ్‌లో ఎంట్రీ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఆ బ్యూటీకి అనుకోని షాక్ తగిలింది. అయినా బాలీవుడ్‌లో తన సత్తా ఏంటో నిరూపించుకున్న శ్వేతబసు ప్రసాద్.. టాలీవుడ్‌లో ఏమేరకు ఛాన్సులు రాబట్టుతుందో వేచి చూడాలి.