శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 29 ఏప్రియల్ 2020 (23:29 IST)

ఎట్టకేలకు ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యింది

ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి. చిన్న సినిమాగా రూపొందిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత అజయ్ భూపతితో సినిమా చేసేందుకు యంగ్ హీరోలు ఇంట్రస్ట్ చూపించారు. 
 
రామ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రవితేజ, నితిన్, నాగచైతన్య లతో అజయ్ భూపతి సినిమా అంటూ వార్తలు వచ్చాయి కానీ.. సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయాయి.
 
 దీంతో బ్లాక్ బస్టర్ ఇచ్చినా అజయ్ తో సినిమా చేసేందుకు ఏ హీరో కూడా ఎందుకు ముందుకు రావడం లేదు అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఎట్టకేలకు అజయ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఓకే అయ్యిందని తెలిసింది. 
 
ఇంతకీ.. ఎవరితో అంటారా..? యువ శర్వానంద్‌తో ఫిక్స్ అయ్యింది. ఇందులో మరో హీరో కూడా ఉన్నారు. ఇంతకీ.. మరో హీరో ఎవరంటారా..? సిద్ధార్థ్. అవును... శర్వానంద్ - సిద్ధార్థ్ కాంబినేషన్లో అజయ్ భూపతి సినిమా చేయనున్నారు. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మింనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వలరో అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయనున్నారు. మరి.. ఈ సినిమాతో కూడా అజయ్ భూపతి సక్సస్ సాధిస్తాడని ఆశిద్దాం.