ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (08:32 IST)

ఆ హీరోయిన్ మాయలో అల్లు వారబ్బాయి... సమ్‌థింగ్.. సమ్‌థింగ్...

సాధారణంగా చిత్రపరిశ్రమలోని హీరోహీరోయిన్ల మధ్య లవ్ అటాచ్‌మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాస్త ఎక్కువైతే ప్రేమగా మారుతుంది. అలా ప్రేమలో అనేకమంది కుర్రకారు హీరోహీరోయిన్లు ఉన్నారు. అయితే, మెగా కాంపౌండ్‌కు చెందిన హీరోలు ఇలాంటి ప్రేమ వ్యవహారాలకు కాస్త దూరంగా ఉంటారనే టాక్ ఉంది. కానీ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రెండో అబ్బాయి, అల్లు శిరీష్ మాత్రం ఓ హీరోయిన్ మాయలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా, వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తున్నట్టు టాలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ ఊహాగానాలు రావడానికి ప్రధాన కారణం అల్లు శిరీష్ పోస్ట్ చేసిన వీడియోనే. ఇంతకీ ఆ వీడియోలో ఉన్న భామ ఎవరో కాదు.. మెగా కాంపౌడ్ నుంచి టాలీవుడ్‌కు పరిచయమైన అను ఎమ్మాన్యుయేల్. 
 
గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన "అజ్ఞాతవాసి",  అల్లు అర్జున్ "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా" సినిమాల్లో నటించింది. ఈ భామ ఇప్పుడు అల్లు శిరీష్‌తో ప్రేమలో ఉందని ఇండస్ట్రీలో వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి. అను బర్త్ డే సందర్భంగా శిరీష్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. అందులో ఆమెతో ఉన్న విధానం చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని వార్తలు ఎక్కువైపోతున్నాయి. 
 
మార్చి 28న అను పుట్టిన రోజు. ఈమెకు తనదైన శైలిలో అల్లు శిరీష్ బర్త్ డే విషెస్ చెప్పాడు. అంతేకాదు ఈమెను సైకో అంటూ ప్రేమగా పిలిచాడు. అను చాలా క్యూట్‌గా ఉంటుందంటూ శిరీష్ చెప్తున్నాడు. ఆ వెంటనే హ్యాపీ బర్త్ డే సైకో, ఆలస్యంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నానని తెలుసు.. కానీ ఈ వీడియోతో రావడానికి లేట్ అయింది.. హ్యాపీ బర్త్ డే సైకో.. నీకు అంతా మంచి జరగాలి అంటూ శిరీష్ విష్ చేశాడు.