శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: గురువారం, 7 జూన్ 2018 (20:07 IST)

జీవితంలో నేను భయపడేది ఆ ఒక్కదానికే.. అనుష్క

డార్లింగ్ అనుష్క జీవితంలో కొన్ని కోల్పోతోందట. ఎప్పుడూ సినిమాల్లో బిజీగా ఉంటోంది అనుష్క. ఒక సినిమా పూర్తయితే మరో సినిమాతో చాలా బిజీగా గడుపుతోంది అనుష్క. గతంలో సినిమాల షూటింగ్ సమయంలో ఒక్క నిమిషం కూడా అస్సలు తనకు తీరిక లేకుండా పోయేదట. కానీ ఇప్పుడు స్నేహ

డార్లింగ్ అనుష్క జీవితంలో కొన్ని కోల్పోతోందట. ఎప్పుడూ సినిమాల్లో బిజీగా ఉంటోంది అనుష్క. ఒక సినిమా పూర్తయితే మరో సినిమాతో చాలా బిజీగా గడుపుతోంది అనుష్క. గతంలో సినిమాల షూటింగ్ సమయంలో ఒక్క నిమిషం కూడా అస్సలు తనకు తీరిక లేకుండా పోయేదట. కానీ ఇప్పుడు స్నేహితులతో కలుస్తూ చాలా సంతోషంగా ఉందంటోంది అనుష్క.
 
కానీ స్నేహితులను కలిసినప్పుడు తనకు ఉన్న ఒకే ఒక్క భయాన్ని వారికి చెప్పి బాధపడుతోందట. ఈమధ్య తనకు నిద్రలో కలలు ఎక్కువగా వస్తున్నాయట. నిద్రలో తనకు ఎప్పుడైనా కల వస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందట. కొన్ని పీడకలలు కూడా ఈమధ్య అనుష్కకు వచ్చాయట. దీంతో ఆ కలలను తలుచుకుని భయపడిపోతోందట అనుష్క. 
 
కలలు రాకుండా ఏం చేయాలో స్నేహితులను అడుగుతోందట. తన నిజ జీవితంలో చిన్నప్పుడు కొన్ని కలలు కన్నానని అవి జరిగాయని, అందులో కొన్ని తనకు అనుకూలంగా ఉంటే కొన్ని ప్రతికూలంగా ఉన్నాయని చెప్పిందట అనుష్క. ఇప్పుడు కూడా తాను అదే పరిస్థితి ఎదుర్కొంటున్నానని, కల అంటే తనకు భయమని, ఆ ఒక్కటి తప్ప మిగిలిన దేనికీ తను భయపడనని చెబుతోంది అనుష్క.