బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: మంగళవారం, 29 జూన్ 2021 (19:02 IST)

బిగ్ బాస్-5 కంటెస్టెంట్లు వీరే... మహిళలే ఎక్కువగా...

బిగ్ బాస్ షో తెలుగు బుల్లితెరపై ఏ స్థాయిలో ఉందో చెప్పనవసరం లేదు. ప్రతి ఎపిసోడ్‌ను జనం ఎంతో ఆసక్తికరంగా చూస్తుంటారు. బిగ్ బాస్ షో నాలుగు సీజన్లలోను పురుషులే విజేతలుగా నిలిచారు. మహిళలు పోటీ పడినా చివరకు గెలవలేకపోయారు. ఇక ఐదవ ఎపిసోడ్‌కు ఇప్పటికే కంటెస్టెంట్లను నిర్ణయించేశారట.
 
మొత్తం 16 మంది కంటెస్టెంట్లలో 9మంది మహిళలనే పెట్టారట. అందులో సీనియర్ నటి యమున, న్యూస్ యాంకర్ ప్రత్యూష, టిక్ టాక్ స్టార్ భాను, సింగర్ మంగ్లీ, యాంకర్ వర్షిణి, సీనియర్ నటి ప్రియ, హీరోయిన్ సురేఖ వాణి, వరంగల్ వందన, జబర్ధస్త్ వర్షలు ఉన్నారట. 
 
ఇక పురుషుల్లో రంగస్థలం మహేష్, యాంకర్ శివ, సీనియర్ ఆర్టిస్ట్ రాఘవ, షణ్ముఖ్, చమ్మక్ చంద్ర, టిక్ టాక్ దుర్గారావుతో పాటు మరో యాంకర్ ఉన్నారట. వీరి పేర్లను ఖరారు చేసి వారికి సమాచారం కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ఆలస్యమైన ఈ సీజన్‌ను అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారట.