శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2023 (11:15 IST)

"ఫ్యామిలీ స్టార్" కోసం రష్మిక మందన్న స్పెషల్ సాంగ్?

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా "ఫ్యామిలీ స్టార్" చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. దర్శకుడు పరశురామ్‌ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను అమెరికాలో ప్లాన్ చేశాడు. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజా అప్డేట్ వచ్చింది. ఫ్యామిలీ స్టార్‌లో యానిమల్ ఫేమ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
 
ఇటీవల విజయ్, మృణాల్, రష్మికలపై చిత్రీకరించిన ఫ్యామిలీ స్టార్ ప్రత్యేక పాటలో ఆమె అలరించింది. ఈ పాట చిత్రీకరణకు మృణాల్ హైదరాబాద్‌లో అందుబాటులో లేకపోవడంతో ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ పాటను చిత్రీకరించారు. మరోవైపు, రష్మిక కేవలం ఒక పాటలో కనిపిస్తుందా లేదా లేకుంటే కీలక పాత్రలో కనిపిస్తుందా అనేది తెలియాల్సి వుంది.