చైతు - అఖిల్ కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరు..?
అక్కినేని ఫ్యామిలీ హీరోలు కలిసి నటించిన సంచలన చిత్రం మనం. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణ పొంది ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఇందులో నాగార్జున, చైతన్య నటించగా చివరిలో అఖిల్ మెరుపు తీగలా కనిపించి ఆడియన్స్‌కి థ్రిల్ కలిగించాడు. ప్రస్తుతం చైతన్య వెంకీ మామ సినిమా చేస్తున్నాడు. అఖిల్ గీతా ఆర్ట్స్‌లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
అయితే.. ఇప్పుడు చైతన్య - అఖిల్ కాంబినేషన్లో మూవీ ప్లాన్ జరుగుతోందని వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ... ఈ క్రేజీ మూవీకి డైరెక్టర్ ఎవరంటారా..? చి.ల.సౌ, మన్మథుడు 2 చిత్రాల దర్శకుడు రాహుల్ రవీంద్రన్. అవును.. ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. చి.ల.సౌ సినిమాతో మోస్తరు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రాహుల్ రవీంద్రన్‌కి రెండో సినిమాతోనే నాగార్జునని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది.
రాహుల్ వర్క్ పట్ల అన్నపూర్ణ స్టూడియోస్ హ్యాపీ అట. కాబట్టి, ఈ అక్కినేని మల్టీస్టారర్‌కు రాహుల్ అయితే బెటర్ అనుకుంటున్నారని టాక్. ఈ అక్కినేని హీరోలిద్దరిని మేనేజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అసలు ప్రచారంలో ఉన్న వార్త నిజమేనా..? కాదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.