శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 15 జూన్ 2022 (00:07 IST)

ఛాతి నొప్పితో ఆసుపత్రికి వెళ్ళిన దీపికా పదుకొణె!

Deepika Padukone
Deepika Padukone
బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొనె మంగళవారం హైద‌రాబాద్‌లోని ప్రైవేట్ ఆసుప‌త్రికి వెళ్ళింది. దీనిపై ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వ‌చ్చాయి. ఛాతిలో నొప్పి రావ‌డంతో వెంట‌నే ఆమెను ఫిలిం సిటీ నుంచి తర‌లించార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఆమె హైదరాబాద్‌లో 'ప్రాజెక్ట్ కె' షూటింగ్‌లో ఓ సీన్ చేస్తుండ‌గా దీపికా పదుకొణె ఛాతీలో బరువుగా అనిపించినట్లు వుంద‌ని ద‌ర్శ‌కుడుకి చెప్ప‌డంతో వెంట‌నే ఆమెను ఆసుప‌త్రికి తీసుకెళ్ళార‌ని తెలుస్తోంది.
 
అయితే విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం మూడు రోజుల క్రితం సాధారణ చెక‌ప్ కోసం శ్వాస‌లో ఏదైనా ప్రాబ్ల‌మ్‌గా వుందేమోన‌ని క‌రోనా టైం గ‌నుక ముందు జాగ్ర‌త్త‌గా టెస్ట్ చేసుకుంద‌ని చిత్ర యూనిట్ చెబుతోంది.


త‌గు విధంగా డాక్ట‌ర్లు ట్రీట్‌మెంట్ చేయ‌డం, మంగ‌ళ‌శారంనాడు షూట్‌లో పాల్గొన‌డం జ‌రిగింది. ఈ విష‌య‌మై ప‌లు ర‌క‌రాలుగా క‌థ‌నాలు వ‌చ్చాయి. 'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్ మరియు అమితాబ్ బచ్చన్‌లతో పాటు కీలక సన్నివేశాలు ఉన్నాయి. అవి ఈ షెడ్యూల్‌లో తీయ‌నున్నార‌ని తెలిసింది.