చిరుతో దిల్ రాజు సినిమా... ఇంతకీ దర్శకుడు ఎవరు..?
దిల్ రాజు.. అభిరుచి గల నిర్మాత. ఆయన సీనియర్ హీరోలు, అగ్ర హీరోలు, యువ హీరోలు.. ఇలా చాలామంది హీరోలతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే.. సీనియర్ హీరోల్లో నాగార్జునతో గగనం, వెంకటేష్‌తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేసారు.
చిరంజీవి, బాలకృష్ణలతో మాత్రం ఇప్పటివరకు సినిమా చేయలేదు. ఇప్పుడు చిరంజీవితో సినిమా చేయాలనుకుంటున్నారట. ఈ విషయం ఇటీవల దిల్ రాజు చిరుకు చెబితే వెంటనే ఓకే అన్నారట. దీంతో దిల్ రాజు కథ రెడీ చేయిస్తున్నారట. ప్రస్తుతం చిరు సైరా సినిమా చేస్తున్నారు. అక్టోబర్ 2న సైరా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.
ఈ సినిమా తర్వాత చిరు బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం. అన్నీ అనుకున్నట్టు జరిగితే కొరటాల శివతో చేస్తున్న సినిమా తర్వాత చిరు దిల్ రాజు బ్యానర్లో సినిమా చేయచ్చు. మరి.. దర్శకుడు ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.