సైరా నరసింహారెడ్డితో నేనూ పవర్ స్టార్... నాదెండ్ల మనోహర్ ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి 'సైరా' సినిమా ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అక్టోబర్ 2వ తేదీన సినిమా విడుదల ఉండటంతో చిరంజీవితో సహా చిత్ర యూనిట్ మొత్తం తీరిక లేకుండా పనిచేస్తున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవిని ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ కలిశారు.
ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. 'పవన్ కళ్యాణ్ గారు, నేను సైరా నరసింహారెడ్డి (చిరంజీవి గారి)తో సమావేశమయ్యాం. చాలా విషయాలు చర్చించుకున్నాం. ఆయన జీవిత ప్రయాణం మాకెంతో స్ఫూర్తి కలిగించింది. ఆయనకు గొప్ప విజయం దక్కాలని ఆశిస్తున్నాను.
ఆయనతో ఇలాంటి సమావేశాలు మరెన్నో జరగాలని ఆశిస్తున్నాను` అంటూ ట్వీట్ చేశారు. ముగ్గురు కలిసిన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు నాదెండ్ల.