శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 23 మే 2020 (17:32 IST)

చిరు సినిమాపై క్లారిటీ ఇచ్చిన బాబీ, ఇంతకీ సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ తర్వాత స్పీడు పెంచి దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటివరకు నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే...  ఈ సినిమా తర్వాత వరుసగా మూడు సినిమాలకు ఓకే చెప్పినట్టు చిరంజీవి ఇటీవల ప్రకటించారు. అందులో సాహో డైరెక్టర్ సుజిత్‌తో ఓ సినిమా, వెంకీమామ డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో ఓ మూవీ, మెహర్ రమేష్‌ డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నట్టు చిరంజీవి తెలియచేసారు. అయితే... చిరంజీవితో చేయనున్న సినిమా గురించి ఫస్ట్ టైమ్ డైరెక్టర్ బాబీ స్పందించారు.
 
ఇంతకీ ఏం చెప్పారంటే... చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఈ సినిమా ఉంటుందన్నారు. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుందన్నారు. చిరంజీవి గారికి కథ చెప్పగానే.. వెంటనే ఈ సినిమా మనం చేద్దామన్నారు.

ఓ కొత్త తరహా కథతో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేలా ఈ సినిమాని తెరకెక్కిస్తానన్నారు బాబీ. ఈ మూవీని ఎవరు నిర్మించనున్నారు..? అనేది ఇంకా ఖరారు కాలేదు. అయితే.. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి కాస్త టైమ్ పడుతుంది. ఎప్పుడు స్టార్ట్ కానుంది..? ఎవరు నిర్మిస్తారు..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.