గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2023 (11:27 IST)

ఓ మహిళ అభ్యంతరకరంగా తాకింది.. దుల్కర్ సల్మాన్

మహిళలు తనను అనుచితంగా తాకారని దుల్కర్ సల్మాన్ షాకింగ్ అనుభవాన్ని వెల్లడించాడు. హీరోయిన్స్‌కే కాదు.. హీరోలకు కూడా ఫ్యాన్స్ నుంచి ఇబ్బందులు తప్పవనేందుకు ఈ ఘటనే నిదర్శనం. ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ వేదికపై ఉన్న సమయంలో ఒక మహిళ ప్రవర్తన తనను ఇబ్బంది పెట్టిందని చెప్పారు.
 
"ఒకే కన్మణి, సీతా రామం తర్వాత నాకు కేరళలో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. సాధారణంగా నాకు అబ్బాయిలలో ఫాలోయింగ్ ఎక్కువ. నేను ఎప్పుడూ వారితో టచ్‌లో ఉంటాను. అయితే అభిమానుల కారణంగా గతంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కొంతమంది మహిళలు ఫోటో తీస్తున్నట్లుగా బుగ్గపై ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. వారి ప్రవర్తన అసౌకర్యంగా ఉంటుంది. అంతకుముందు ఓ మహిళా అభిమాని నన్ను అసభ్యంగా తాకింది. చాలా ఇబ్బంది పడ్డాను" అని దుల్కర్ సల్మాన్ అన్నారు.
 
ఇంకా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ... "నాకు 28 ఏళ్ల వయసులో పెళ్లి అయింది. నా భార్య అమల్ సోఫియా, నేను చిన్నప్పుడు ఒకే స్కూల్‌లో చదువుకున్నాం. నేను ఆమెను కలిసినప్పుడు ఆమె నా జీవితం, నా కుటుంబంలో ఒక భాగమని నేను గ్రహించాను. ఇలాంటి అమ్మాయిని నేనెప్పుడూ చూడలేదు. నాకు పెళ్లి, కెరీర్ ఒకేసారి మొదలయ్యాయి. పెళ్లయిన కొద్ది రోజులకే రెండో సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాను. ఎంత బిజీగా ఉన్నా ఆమెతో గడపడం ఇష్టం. అలాంటి సమయంలో ఆమె నాకు ఎంతగానో సహకరించింది" అంటూ చెప్పుకొచ్చాడు.
 
దుల్కర్ ఇప్పుడు తన రాబోయే చిత్రం కింగ్ ఆఫ్ కొత్త ప్రమోషన్ కార్యక్రమాలలో మళ్లీ బిజీగా ఉన్నాడు. ఆగస్ట్ 24న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.