Festival Posters
✕

నా బిడ్డను కోల్పోయినందుకు సీఎం విజయే కారణం.. జూలీ షాకింగ్ కామెంట్స్

Written By సెల్వి
Updated: మంగళవారం, 2 జూన్ 2026 (16:22 IST)
Actress Julie-Vijay
తమిళనాడు సీఎం విజయ్, ఆయన పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) సపోర్టర్స్ వేధింపుల వల్లే తనకు గర్భస్రావం అయిందని బిగ్‌బాస్ కంటెస్టెంట్, మాజీ నర్సు, నటి మరియా జూలీ షాకింగ్ కామెంట్స్ చేశారు. టీవీకే సపోర్టర్స్ తనను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారని నటి జూలీ అన్నారు. దీనివల్ల తాను మానసికంగా కుంగిపోయానని, గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఈ వేధింపులు కొనసాగడంతో తీవ్ర ఒత్తిడికి గురై గర్భస్రావం అయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
 
తనకు గర్భస్రావం కావడానికి, తన బిడ్డను కోల్పోవడానికి సీఎం విజయ్ కారణమని ఆరోపించారు. ఈ విషయంలో గత మార్చిలో 8 మందిపై ఫిర్యాదు చేసినట్లు కూడా ఆమె చెప్పారు. తన భర్తను కూడా  రూ.15 లక్షల కిడ్నీ స్కామ్‌లో ఆయనను ఇరికించారని అన్నారు. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ కేసులో తనకు నోటీసులు పంపి వేధిస్తున్నారని, దీని వెనుక టీవీకే వ్యక్తి, ఓ లాయర్ ఉన్నారని ఆమె ఆరోపించారు.
About Author
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... Read More

అన్నీ చూడండి

భార్యతో గొడవ - రూ.500 కరెన్సీ నోట్లను తగలబెట్టిన భర్త (వీడియో)

వాడుపోతే ఏ బాధా వుండదు : ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య ప్లాన్ (Video)

ఏపీ పంచాయతీ ఎన్నికలు : పోటీ చేసేందుకు జనసేన శ్రేణులకు పూర్తి స్వేచ్ఛ

15వ వివాహం... 16వ తేదీన నవ వధువు ప్రసవం... వరుడు షాక్

గుజరాత్‌లో ఘోరం - ట్రక్కును ఢీకొన్న కారు - ఏడుగురు మృతి

అన్నీ చూడండి

శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?

డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్‌కు పాలీహెర్బల్ యాంటీ డయాబెటిక్ ఫార్ములా : ఎస్ఆర్ఎంటీ వెల్లడి

సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్

చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు

మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?

తర్వాతి కథనం
Show comments