శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : గురువారం, 6 డిశెంబరు 2018 (16:34 IST)

గీత గోవిందం.. విషయంలో అలా జరగలేదు..

అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవర కొండ ''గీత గోవిందం'' సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజాగా వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఈ సినిమాతో స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ ఎదిగిపోయాడు. అలాంటి సినిమాను జీ తెలుగు ఛానల్ ఈ మధ్య ప్రసారం చేసింది. ఈ సినిమా 20.18 టీఆర్పీ రేటింగ్ సాధించింది. ఈ స్థాయి రేటింగ్ రావడం ఇదే తొలిసారి. 
 
ఏ సినిమా అయినా రెండో సారి బుల్లితెరపై ప్రసారమైనప్పడు రేటింగ్ విషయంలో భారీ తేడా కనిపిస్తుంది. కానీ గీత గోవిందం.. విషయంలో అలా జరగలేదు. రెండోసారి ఈ సినిమాను జీ తెలుగు ప్రసారం చేసినా 17.16 టీఆర్పీని రాబట్టింది. ఇలా రెండోసారి ప్రసారమైన తెలుగు సినిమా 17.16 టీఆర్పీ రేటింగ్ సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తద్వారా 2018లో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన సినిమాగా గీత గోవిందం నిలిచింది.