గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 మార్చి 2022 (13:19 IST)

విడాకుల తర్వాత సమంత పెళ్లి చీరను చైతూకు ఇచ్చేసిందా?

Samantha
విడాకుల తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన పెళ్లి చీరను మాజీ భర్త నాగ చైతన్యకు తిరిగి ఇచ్చేసిందనే వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 2010లో గౌతమ్ మీనన్ ఏ మాయ చేసావే సినిమా తర్వాత సమంత, నాగచైతన్య ప్రేమలో పడ్డారు. 
Samantha
ఆపై టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆమె అభిమానులు ఆమెను ఆరాధిస్తున్నారు. అయితే అనూహ్యంగా గత ఏడాది అక్టోబర్‌లో తన భర్త నాగ చైతన్య నుండి విడిపోతున్నట్లు ప్రకటించి.. ఫ్యాన్సుకు షాకిచ్చింది సమంత. తర్వాత సినిమాలపై దృష్టి పెట్టిన సమంత తన పెళ్లి చీరను కూడా చైతూకు తిరిగి ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను సమంత, చైతూ ధ్రువీకరించలేదు. 
Samantha Akkineni
 
ఇకపోతే.. సమంత పెళ్లి చీర నాగ చైతన్య అమ్మమ్మకి చెందినది. సమంత ఈ చీరను పెళ్లికి ధరించింది. పెళ్లికి ముందు సమంత డిజైనర్, స్నేహితురాలు క్రేషా బజాజ్ కొన్ని తుది మెరుగులు దిద్దింది. 2010 నుంచి ప్రేమలో వున్న సమంత-చైతూ ఈ జంట అక్టోబర్ 6, 2017న గోవాలో వివాహం చేసుకున్నారు, ఆ తర్వాత వరుసగా అక్టోబర్ 7, 2017న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. 
Samantha Akkineni

 
 
అయితే 2022 అక్టోబరులో ఈ జంట విడిపోయింది. ప్రస్తుతం వెబ్ సిరీస్, సినిమాలు, బాలీవుడ్ ఎంట్రీలతో సమంత బిజీ అయిపోయింది. అలాగే చైతూ కూడా వరుస ఆఫర్లతో పాటు అమీర్ ఖాన్-కరీనా కపూర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' ద్వారా బాలీవుడ్ అరంగేట్రం కోసం సిద్ధంగా ఉన్నాడు.