మంగళవారం, 18 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శనివారం, 21 మే 2016 (11:02 IST)

ఒకే ఇంట్లో హృతిక్ రోషన్ - సుజానా ఖాన్‌ల పార్టీ.. మళ్లీ ఒక్కటవుతారా?

నాలుగేళ్ల పాటు ప్రేమించుకొని, 13 యేళ్ళపాటు వివాహబంధాన్ని కొనసాగించి ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యాక హృతిక్‌ రోషన్‌, సుజానే ఖాన్‌ విడిపోవడం సినీపరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఇద్దరు సినీకుటుంబం నుంచి వచ్చినవారే కాబట్టి చిన్నతనం నుంచే ఆ ఇద్దరూ ఒకరికి ఒకరు బాగా తెలుసు. 2000 సంవత్సరంలో పెళ్లాడటానికి ముందు నాలుగేళ్ల పాటు ఆ ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన ఆరేళ్లకు రెహాన్‌, ఎనిమిదేళ్లకు హృదాన్‌ జన్మించారు. ఆ తర్వాత కొన్ని మనస్పర్థల కారణంగా ఇద్దరూ 2013 డిసెంబర్‌లో విడిపోయారు. 
 
ఈ ప్రేమ జంట విడిపోతున్నారని వార్తలొచ్చినప్పుడు హృతిక్ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహానికి లోనయ్యారు. కానీ ఈ జంట మాత్రం అన్ని జంటల్లా ఎడమొహం పెడమొహం పెట్టకుండా విడాకులు తీసుకున్న తర్వాత కూడా అప్పుడప్పుడు పిల్లల కోసం కలుస్తూనే ఉన్నారు. కలిసిన ప్రతీసారి చాలా సరదాగా గడుపుతున్నారు. మొన్నటికిమొన్న కంగనా రనౌత్‌తో ఎఫైర్ వివాదంలోనూ సుజానే తన మాజీ భర్త హృతిక్‌కి చేదోడువాదోడుగా నిలిచింది. 
 
ఇటీవలే చిన్న కొడుకు బర్త్ డే కోసం కూడా ఇద్దరూ కలిసి సరదాగా గడిపారు. ఇదిలావుంటే, తాజాగా ప్రముఖ సామాజికవేత్త అను దివాన్ ఇంట్లో హృతిక్ రోషన్, సుజానే ఖాన్‌లు ఇద్దరూ పార్టీ చేసుకున్నారట. అయితే మళ్లీ ఈ ప్రేమ పావురాలు మళ్లీ కలుసుకోవడానికి ఆస్కారం లేకపోలేదని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.