శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 18 నవంబరు 2024 (17:26 IST)

సెలూన్ ముసుగులో వ్యభిచారం, బ్యాంక్ ఉద్యోగిని బ్లాక్‌మెయిల్ చేసి రూ. 5 లక్షలు డిమాండ్ ( video)

girls
సెలూన్ ముసుగులో నడుస్తున్న వ్యభిచారం ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో యునిసెక్స్ సెలూన్ ముసుగులో సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. సెలూన్ నడుపుతున్నవారు బ్యాంక్ ఉద్యోగినిని బ్లాక్ మెయిల్ చేసి రూ.3 లక్షలు వసూలు చేసి మరో రూ.5 డిమాండ్ చేశారు.
 
దీనితో అతడు పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సెలూన్ పైన మెరుపు దాడి చేసారు. ఈ తనిఖీల్లో అరడజను మంది కాల్ గర్ల్స్‌తో సహా 16 మంది పట్టుబడ్డారు. అసాంఘిక వ్యవహారం కోసం లోపల ప్రత్యేకమైన గది కూడా వుండటాన్ని పోలీసులు గమనించారు. వీరందిరినీ పోలీసులు అరెస్టు చేశారు.