శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 29 మే 2021 (12:30 IST)

నాకు హీరో నచ్చితేనే అతడితో చేస్తా, అతడు నాకే నచ్చకపోతే నేనెలా చేసేది: ఇలియానా

ఇలియానా. పోకిరి చిత్రంలో బాక్సూలో ఉప్మా పెట్టుకుని కాలేజీకి, యోగా ట్యూటర్‌గా వెళ్లే పాత్రలో నటించి యువకుల హృదయాల్లో గిలిగింతలు పెట్టింది. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి దగ్గరైంది. మళ్లీ ఇప్పుడు ఇక్కడ కూడా చేస్తానని అంటోంది. ఐతే దానికి కొన్ని కండిషన్స్ పెడుతోంది.
 
అదేంటయా అంటే... తను నటించబోయే చిత్రంలో హీరో తనకు బాగా నచ్చాలంటోంది. ఆ హీరో తనకు నచ్చితేనే ఒప్పుకుంటానంటోంది. తనకు హీరో నచ్చకపోతే ఇక అతడు ప్రేక్షకులకు ఎంతమాత్రం నచ్చుతాడు అంటూ ప్రశ్నిస్తుంది. కనుక ముందుగా తను చేయబోయే హీరో తన కళ్లకు నచ్చితేనే సినిమాలో నటించేందుకు అంగీకరిస్తానంటోంది.
 
అంతేకాదు, సినీ ఇండస్ట్రీలో ప్రేక్షకులు ఎంతకాలం తనను ఆదరిస్తారో అంతకాలం నటిస్తానని చెపుతోంది. వాళ్లకు మొహం మొత్తితే సినిమాలు చేయడం మానేస్తానంటోంది ఈ బక్కబలచని బ్యూటీ.