బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (15:36 IST)

రవితేజతో మాస్ మసాలా సాంగ్‌.. చిందులేయనున్న ఇలియానా

పోకిరి, జల్సా, జులాయి, కిక్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో మంచి పేరు కొట్టేసిన ఇలియానా.. తాజాగా ఇలియానా రవితేజ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. 
 
రవితేజ హీరోగా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా రూపొందుతోంది. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ కథానాయికలుగా అలరించనున్నారు.
 
ఈ సినిమాలో ఒక మాస్ మసాలా సాంగ్ ఉండటంతో, ఇలియానాతో చేయిస్తే బాగుంటుందని రవితేజ చెప్పాడని.. అందుకు ఇలియానా కూడా ఓకే చేసిందని వార్తలు వస్తున్నాయి.