బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 26 జనవరి 2022 (17:48 IST)

ఖిలాడి నుంచి ఫుల్ కిక్కు పాట వ‌చ్చేసింది

Khiladi song
రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రూపొందుతోన్న ఖిలాడీ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజ బర్త్ డే సందర్భంగా ఫుల్ కిక్కు..అంటూ సాగే నాలుగో పాట లిరికల్ వీడియోను ఈ రోజు రిలీజ్ చేశారు.
 
ఈ మాస్ సాంగ్‌ కు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అధ్బుతమైన ట్యూన్ సమకూర్చారు. సాగర్, మమతా శర్మ ఈ పాటను ఫుల్ ఎనర్జీ తో ఆలపించారు. ఇక శ్రీమణి అందించిన సాహిత్యం మాస్‌ను ఆకట్టుకునేలా ఉంది. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొత్త స్టెప్పులు వేయించారు. ఇక రవితేజ, డింపుల్ హయతి కలిసి తమ డాన్స్ తో అభిమానులను ఫుల్ ఖుషీ చేశారు. లుంగిలో రవితేజ మాస్ స్టెప్పులు, తెరపై ఆయన ఎనర్జీ అభిమానులకు కన్నుల పండువగా ఉంది.
 
బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. రవితేజ సరసన మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా నటించారు.
 
సుజిత్ వాసుదేవ్,  జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా.. అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
ఈ చిత్రం ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.
 
నటీనటులు : రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి, అర్జున్, ఉన్ని ముకుందన్, అనసూయ భరద్వాజ్