శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 6 జులై 2020 (13:37 IST)

వినాయక్ శీనయ్యను దిల్ రాజు ఆపేశారా? ఎందుకని?

డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ హీరోగా నరసింహారావు దర్శకత్వంలో శీనయ్య అనే సినిమా ప్రారంభించిన విషయం తెలిసిందే. సక్సస్‌ఫుల్ మూవీస్ అందించిన వినాయక్ హీరోగా సినిమా అనగానే అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను ఆసక్తి ఏర్పడింది. అయితే... కొంత షూటింగ్ చేసిన తర్వాత అప్పటివరకు షూట్ చేసిన ఫుటేజ్ చూసుకుంటే.. సరిగా రాలేదనిపించడంతో ఆపేసారు. దీంతో ఈ మూవీ ఆగిపోయింది అని వార్తలు వచ్చాయి.
 
ఈ సినిమా ప్రస్టేజీయస్‌గా తీసుకున్న వినాయక్ పరుచూరి బ్రదర్స్‌ను రంగంలోకి దింపారు. కథపై మళ్లీ కసరత్తు చేసారు. పరుచూరి బ్రదర్స్ సలహాలు సూచనలతో కొన్ని మార్పులుచేర్పులు చేసారు. ఇప్పుడు బాగానే ఉంటుందనిపించి మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేసారు. షూటింగ్ కొన్ని రోజులు జరిగింది. ఇప్పుడు కరోనా కారణంగా షూటింగ్‌కి బ్రేక్ పడింది.
 
అయితే... తాజాగా జరిగిన షూటింగ్ కూడా దిల్ రాజుకు సంతృప్తికరంగా అనిపించకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను ఇక్కడితో ఆపేస్తున్నట్టు టీమ్ మెంబర్స్ అందరికీ చెప్పారని సమాచారం. దీంతో టీమ్ అంతా వేరే ప్రాజెక్ట్‌కి షిప్ట్ అయినట్టు టాక్. వినాయక్ దర్శకుడిగా తదుపరి చిత్రం కోసం కథపై కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. మరి... వినాయక్ ఎవరితో సినిమా చేస్తాడో..? ఏ నిర్మాత ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తాడో..?