గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 29 అక్టోబరు 2020 (15:07 IST)

మహేష్ - త్రివిక్రమ్ మూవీ లేదా? అసలు ఏం జరిగింది..?

సూపర్ స్టార్ మహేష్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ ఇద్దరి కాంబినేషన్లో మూవీ రానుందని గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే... అఫిషియల్ ఎనౌన్స్‌మెంట్ మాత్రం రావడం లేదు. రీసెంట్‌గా ఈ కాంబో మూవీ గురించి జోరుగా వార్తలు వచ్చాయి. దీంతో మహేష్, త్రివిక్రమ్ మూవీ ఫిక్స్, జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తారనుకున్నారు.
 
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించడానికి రెడీ అయ్యింది. తాజా వార్త ఏంటంటే... ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందట. కారణం ఏంటంటే.. సర్కారు వారి పాట సినిమా తర్వాతే మహేష్ త్రివిక్రమ్‌తో సినిమా చేయాలనుకుంటున్నారు. అప్పటివరకు త్రివిక్రమ్ ఆగలేదు. మహేష్ బాబు కోసం ఆగడం కన్నా.. ఎన్టీఆర్‌తో చేయడమే బెటర్ అనుకున్నారు. దీంతో మహేష్‌ బాబుతో త్రివిక్రమ్ చేయాలనుకున్న సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది.
 
ఈ సినిమా సెట్ అవుతుందని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. నమ్రత కూడా ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే బాగుంటుందని అనుకున్నారట. కానీ.. ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుంది కాకపోతే ఎప్పుడు ఉంటుందనేది మాత్రం క్లారిటీ లేదు. మహేష్ బాబు సన్నిహితులు మాత్రం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ... ఖచ్చితంగా వస్తుంది అంటున్నారు.