బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2017 (13:10 IST)

లండన్ లవర్‌తో శ్రుతిహాసన్.. ఎయిర్‌పోర్టులో కనిపించారు.. సెండాఫ్ ఇచ్చిందా? (Photo)

సినీ లెజెండ్ కమల్ హాసన్ కుమార్తె, టాప్ హీరోయిన్ శ్రుతిహాసన్ ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో వుంది. మొన్నటికి మొన్న తన ప్రేమికుడు విదేశాల్లో రాగానే కారులోకి లాక్కున్ని గట్టిగా హత్తుకుని.. ముద్దులెట్టుకుని

సినీ లెజెండ్ కమల్ హాసన్ కుమార్తె, టాప్ హీరోయిన్ శ్రుతిహాసన్ ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో వుంది. మొన్నటికి మొన్న తన ప్రేమికుడు విదేశాల్లో రాగానే కారులోకి లాక్కున్ని గట్టిగా హత్తుకుని.. ముద్దులెట్టుకుని వార్తల్లో నిలిచిన శ్రుతిహాసన్.. తాజాగా తన ప్రేమికుడితో కలిసి నడుస్తూ కెమెరా కంటపడింది. శ్రుతిహాసన్‌కు ప్రస్తుతం చేతిలో హిట్స్ లేకపోవడంతో.. ప్రేమికుడితో అధిక సమయం వెచ్చింది. 
 
ఇంగ్లండ్ డ్రామా గ్రూపులో నటుడిగా వుండే మైకేల్ అనే వ్యక్తితో ప్రేమాయణం నడుపుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్‌కు వచ్చిన మైకేల్ కార్సెల్‌తో  చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు బిటౌన్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. హాలీ డేస్‌ను ఎంజాయ్ చేసేందుకు భారత్‌కు రప్పించిన శ్రుతిహాసన్.. ఆయనను తిరిగి విదేశాలకు పంపించేందుకు గాను ఎయిర్ పోర్టుకు వచ్చింది. 
 
ఈ సందర్భంగా ఈ ఇద్దరినీ అక్కడున్న కెమెరామెన్లు తమ కెమెరాల్లో బంధించారు. మీడియాను ఏమాత్రం లెక్కచేయని శ్రుతి, మైకేల్ వాళ్ల పనేంటో చూసుకుని వెళ్ళిపోయారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.